- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విత్తన దుకాణాల్లో జిల్లా అధికారుల తనిఖీలు
మండలంలోని విత్తన దుకాణాల్లో జిల్లా వ్యవసాయ అధికారి వి.బాబు రావు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

దిశ, ములకలపల్లి: మండలంలోని విత్తన దుకాణాల్లో జిల్లా వ్యవసాయ అధికారి వి.బాబు రావు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు, ఇన్వాయిస్‌లు, సోర్స్ సర్టిఫికెట్లను మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబుతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీలర్లందరూ విధిగా స్టాక్ బోర్డులు ప్రదర్శించాలని, ప్రతి విక్రయానికి రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే విత్తన చట్టం 1966 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులు తొందరపడి పొడి దుక్కిలో పత్తి విత్తనాలు నాటవద్దని, ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని సూచించారు. కనీసం 60 నుంచి 70 మి.మీ. వర్షపాతం నమోదైన తర్వాతే విత్తనాలు వేయాలని, అప్పుడే మొక్కల మొలక శాతం బాగుంటుందని వివరించారు. అలాగే, లూజు విత్తనాలు, లేబుల్ లేని విత్తనాలు కొనుగోలు చేయవద్దని, అక్రమ విక్రయాలు కనిపిస్తే వెంటనే తమకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వం నిషేధించిన గ్లైఫోసెట్, బీజీ-3 పత్తి విత్తనాలను రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ కొనుగోలు చేయవద్దని ఆయన హెచ్చరించారు.






