- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, ఫీచర్స్ : యూరిన్ తరచుగా రంగు మారుతోందా? తరచుగా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నట్లయితే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే మూత్ర పిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే సంకేతాల్లో ఇవి కూడా ఒకటి. నిజానికి కిడ్నీలు శరీరంలో రక్తాన్ని వడబోసి విషపూరిత వ్యర్థాలను బయటకు పంపడంలో కీ రోల్ పోషిస్తాయి. వీటి పనితీరు మందగిస్తే కిడ్నీల వైఫల్యానికి దారితీసి ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి మూత్ర పిండాలు సరిగ్గా పనిచేయడం లేదనే లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాలంటున్నారు నిపుణులు. ఆ లక్షణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
*యూరిన్ తక్కువగా రావడం : యూరిన్ పోతున్న సమయంలో మంటగా అనిపించడం, తరచుగా మరీ తక్కువగా రావడం వంటి సమస్యలను కొందరు పెద్దగా పట్టించుకోరు. అదేదో చిన్న సమస్య అనుకుంటారు. కానీ ఇది తరచుగా రిపీట్ అవుతుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే కిడ్నీలు పనితీరు సరిగ్గా లేకపోయినప్పుడు కూడా మూత్రం తక్కువగా రావడం, మంటగా అనిపించడం వంటి లక్షణాలు సంభవిస్తాయి. వీటిని గుర్తిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి.
*రంగు మారడం: సాధారణంగా యూరిన్ తెల్లగా, లేదా కాస్త ఎల్లో కలర్‌గా వస్తూ ఉంటుంది. అయితే ఇది గోధుమ రంగులో వస్తుంటే మాత్రం అనుమానించాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు. కిడ్నీల పనితీరు మందగించినప్పుడు, ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు డ్యామేజ్ అయ్యే చాన్స్ ఉంటుంది. కాబట్టి లక్షణాలు గుర్తించగానే జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు.
*పొడి చర్మం : వైద్య నిపుణుల ప్రకారం.. చర్మం పొడిగా మారడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే ఎక్కువ పొడిగా ఉండి, తరచుగా దురద వస్తుంటే మాత్రం అది కిడ్నీ డిసీజెస్‌కు సంకేతం కూడా కావచ్చు. దీంతోపాటు మూత్రంలో రక్తం పడటం, మంటగా అనిపించడం, తరచుగా రెడ్, పింక్ బబుల్స్ రావడం కూడా కిడ్నీ వ్యాధులకు సంకేతం అటున్నారు నిపుణులు.
* వాపు : చేతివేళ్లు, మోకాళ్లు, పిక్కలు, ముఖం వంటి భాగాల్లో కొందరికి వాపు వస్తూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అంటే ఇది సాధారణ సమస్య అనుకోవచ్చు. కానీ తరచుగా అదే కంటిన్యూ అవుతుంటే మాత్రం కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు అంటున్నారు నిపుణులు. అట్లనే దీర్ఘకాలంపాటు నిద్రలేమి, రాత్రిళ్లు మధ్య మధ్యలో తరచుగా యూరిన్‌కు వెళ్లాల్సి రావడం, వెళ్లినప్పుడల్లా మంటగా అనిపించడం వంటివి జరుగుతుంటే కూడా కిడ్నీల పనితీరు బాగా లేదని అనుమానించి వైద్య నిపుణులను సంప్రదించాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.






