- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్
by Taduka Kalyani |
ములుగు మండలంలోని కొత్తూరు గ్రామ శివారులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను ములుగు పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు.

X
దిశ, ములుగు: ములుగు మండలంలోని కొత్తూరు గ్రామ శివారులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను ములుగు పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. సీఐ డి. రవిరాజు, ములుగు ఎస్సై రఘుపతిలు తెలిపిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు సీడ్స్ కంపెనీ వెళ్లే మార్గంలో తనిఖీలు నిర్వహించగా కొత్తూరుకు చెందిన చింతల కార్తీక్‌రాజ్ , షేక్ సల్మాన్ అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద తనిఖీ చేయగా 44 గ్రాముల గంజాయి లభించింది. అదనంగా ఒక అపాచీ మోటార్‌సైకిల్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి గజ్వేల్ కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి విక్రయం, వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీఐ సూచించారు. గంజాయి సంబంధిత నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story






