నటి అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు.. వైరల్‌గా యంగ్ నటి కామెంట్స్

by Chukka Sudharani |

94ఏళ్ల వయసులో లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింగ్ గీతం’.

నటి అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు.. వైరల్‌గా యంగ్ నటి కామెంట్స్
X

దిశ, సినిమా: 94ఏళ్ల వయసులో లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింగ్ గీతం’. ఈ సినిమాను ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సమర్పిస్తుండగా.. అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతరం పనుల్లో బిజీగా ఉన్నా ఈ మూవీ జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న యంగ్ నటి అహల్య బమ్రూ తన పాత్రకు సంబంధించిన విశేషాలు పంచుకుంది. ‘నేను ఎప్పుడూ నటిని అవ్వాలని అనుకోలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తుంటాను. నాగ్ అశ్విన్ గారు నా కంటెంట్ చూసి ‘సింగ్ గీతం’లో ఆఫర్ ఇచ్చారు. నా ఆడిషన్ కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ఇచ్చాను. 94 ఏళ్ల వయసులో మోడ్రన్ ఆలోచనతో సినిమా చేయడం సంతీతంగారికే సాధ్యం. సంగీతం శ్రీనివాస్ గారి సినిమాల్లో మహిళల పాత్రలు బలంగా ఉంటాయి. అలాంటిది ఆయన సినిమాలో నాకు అవకాశం రావడం సంతోషంగా ఉంది’ అని తెలిపింది.


Next Story