- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలన్ ది బాయ్ ఆఫీషియల్ ట్రైలర్ రాబోతున్నది..
టాలెంటుడ్ డైరెక్టర్ చిదంబరం దర్శకత్వంలో రాబోతున్న సరికొత్త చిత్రం ‘బాలన్ ది బాయ్’.

దిశ, సినిమా: టాలెంటుడ్ డైరెక్టర్ చిదంబరం దర్శకత్వంలో రాబోతున్న సరికొత్త చిత్రం ‘బాలన్ ది బాయ్’. ఇప్పటికే ఈయన దర్శకత్వంలో వచ్చిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ అనే మలయాళ సినిమా ఇండియా వైడ్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో బాలన్ చిత్రం కోసం మలయాళ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ఆడియన్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ తెస్పియన్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం మనందరికీ బాగా కనెక్ట్ అయ్యే ఒక చక్కటి నేటివిటీ కథతో, మనసును హత్తుకునే బలమైన సెంటిమెంట్, ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ఈ క్రేజీ మూవీ జూన్ 19న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంగా.. తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘బాలన్ ది బాయ్’ ఆఫీషియల్ ట్రైలర్ జూన్ 5న సాయంత్రం 6గంటలకు రాబోతుంది.. వేచి ఉండండి అంటూ తెలిపారు.






