మ్యూజిక్ స్టార్ట్.. ఆదర్శ కుటుంబం అప్డేట్ ఇచ్చిన తమన్

by Chukka Sudharani |

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, వెంకటేష్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’.

మ్యూజిక్ స్టార్ట్.. ఆదర్శ కుటుంబం అప్డేట్ ఇచ్చిన తమన్
X

దిశ, సినిమా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, వెంకటేష్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘ఆదర్శ కుటుంబం’ మ్యూజిక్ స్టార్ట్ అయినట్లు తెలుపుతూ ఓ ఫొటో వదిలాడు. ‘AK47 (ఆదర్శ కుటుంబం) సంగీత స్టార్ట్.. నాకు అత్యంత ఇష్టమైన వెంకటేష్, త్రివిక్రమ్‌తో’ అంటూ ముగ్గురు ఉన్న ఫొటో షేర్ చేశాడు. కాగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

Next Story