వృద్ధురాలి అమాయకత్వం.. కేటుగాడి చేతివాటం

by Taduka Kalyani |

ఓ వృద్ధురాలి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కేటుగాడు పింఛన్ డబ్బులతో ఉడాయించాడు.

వృద్ధురాలి అమాయకత్వం.. కేటుగాడి చేతివాటం
X

దిశ, కొత్తూరు: ఓ వృద్ధురాలి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కేటుగాడు పింఛన్ డబ్బులతో ఉడాయించాడు. కొత్తూరు సీఐ నర్సయ్య కథనం ప్రకారం... కొత్తూరు మున్సిపాలిటీ అంబేద్కర్ కాలనీకి చెందిన జంగగల లక్ష్మమ్మ (70) బుధవారం పోస్ట్ ఆఫీస్ నుంచి రూ. 2000 పింఛన్ డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తుండగా మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన బ్యాగరి మహేష్ ద్విచక్ర వాహనంపై వచ్చి లక్ష్మమ్మ ను పింఛన్ ఇస్తున్నారా అని ప్రశ్నించాడు. పోస్ట్ ఆఫీస్ నుంచి ఇప్పుడే పింఛన్ డబ్బులు తీసుకుని వస్తున్నానని వృద్ధురాలు రూ.2000 చూపించడంతో వాటిని లాక్కొని నిందితుడు ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. జరిగిన సంఘటనపై వృద్ధురాలు లక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తూరు పోలీసులు గురువారం బస్టాండ్ సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగరి మహేష్ ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. వృద్ధులను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న మహేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Next Story