- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flex-Fuel: దేశవ్యాప్తంగా 5,200 ఇథనాల్ స్టేషన్ల ఏర్పాటు
సుమారు 5,200 ఇథనాల్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో పర్యావరణ అనుకూల ‘ఫ్లెక్స్-ఫ్యూయెల్’ వాహనాల వాడకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టును చేపట్టింది. సుమారు 5,200 ఇథనాల్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. మొదటి దశలో వాహన వినియోగం ఎక్కువగా ఉండే మెట్రో నగరాల్లో మౌలిక సదుపాయాలను పరీక్షించడానికి వీటిని ఏర్పాటు చేయనున్నారు. గురువారం మారుతీ సుజుకి ‘వ్యాగన్ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయెల్’ మోడల్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో సరైన కార్ల మోడల్స్ లేకపోవడం వల్లే ఇథనాల్ స్టేషన్ల ఏర్పాటు అనుకున్నంత సక్సెస్ కాలేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. కొత్తగా వచ్చే వాహనాల్లో కనీసం సగం కార్లు ఫ్లెక్స్-ఫ్యూయెల్ ప్రమాణాలకు మారినా కూడా, దేశీయంగా ఇథనాల్ డిమాండ్ ఏకంగా 400 కోట్ల లీటర్లకు పెరుగుతుందని, ఇది అటు కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా.. రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల నుంచి మొక్కజొన్న వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు మారేలా ప్రోత్సహిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.






