- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > ప్రత్యేక వాదాన్ని ఉగ్రవాదంతో పోల్చిన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
ప్రత్యేక వాదాన్ని ఉగ్రవాదంతో పోల్చిన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
by Taduka Kalyani |
ప్రత్యేక వాదాన్ని ఉగ్రవాదం తో పోల్చిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని వక్తలు స్పష్టం చేశారు.

X
దిశ, ఖైరతాబాద్ : ప్రత్యేక వాదాన్ని ఉగ్రవాదం తో పోల్చిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని వక్తలు స్పష్టం చేశారు. తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ.. ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ ప్రాంతం సర్వ నాశనమైందని, ఇక్కడున్న ఫార్మా కంపెనీలన్నీ ఆంధ్రా ప్రాంతం వారివేనన్నారు. బలవంతంగా ఇక్కడి పేదల భూములు లాక్కున్నారని, ఆ భూముల్లో ఫార్మా కంపెనీలు పెట్టి విషాన్ని సైతం చిమ్ముతున్నారన్నారు. తెలంగాణపై ఉన్న విద్వేషంతోనే ఇక్కడి ఐడీపీఎల్, ఐడీఎల్, హెచ్ఎంటీ, ఆల్విన్, నిజాం షుగర్స్, ప్రాగా టూల్స్ లాంటి సంస్థలను మూసివేశాడన్నారు. మరో వైపు సినిమాల్లో నటించే వారికి ఇక్కడ అస్తిత్వం ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. ఇక్కడ సారవంతమైన భూములున్నాయని, ఆంధ్రా వలస పాలకులు బలవంతంగా ఇక్కడి వారి భూములు లాక్కొని ఈ ప్రాంతాన్ని పేద ప్రాంతంగా మార్చారని విమర్శించారు. మళ్లీ అలాంటి అరాచకత్వం తీసుకురావాలన్న ప్రయత్నం జరుగుతున్నందుకే తాము పోరాటాలకు సిద్ధమవుతున్నామన్నారు. నాడు ఎన్టీఆర్ పై చెప్పులు వేయించి, ఆయన చావుకు కారణమైన వ్యక్తి ఎన్టీఆర్ విగ్రహాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రొఫెసర్ బాగయ్య మాట్లాడుతూ మరోసారి తెలంగాణ అస్తిత్వానికి ప్రమాద సూచికలు కనిపిస్తున్నాయని, దానికి ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. తాము ఆంధ్రాకు వ్యతిరేకం కాదని, కానీ నేడు కొత్తగా తెలంగాణలో జలజడి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అలాంటి కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలన్నారు. తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు నిజాలే మాట్లాడారని, ఎక్కడ అసభ్యకరమైన పదాలు ఉపయోగించలేదన్నారు.
కానీ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రా నుంచి జుగుప్సాకరమైన ఫోన్లు, మెసేజ్లు వచ్చాయని, అందుకే తిరగబడుతున్నామని తెలిపారు. ఏపి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు హైదరాబాద్ కు వచ్చి ప్రత్యేక వాదమంటే ఉగ్రవాదమంటూ వ్యాఖ్యానించారని, మీ అయ్య జాగీరా అన్న పదాలను వాడారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 12 ఏండ్ల తర్వాత మళ్లీ ఇక్కడ సంపదను దోచుకోవాలన్న ఆలోచనతో ఇలాంటి పంచాయతీలు పెడుతున్నారన్నారు. తెలంగాణ కవి అందెశ్రీ సమాధి వద్ద పారిశుధ్యం లేదని, అడిగే దిక్కు లేదని, కానీ ఎన్టీఆర్ విగ్రహాలకు మాత్రం స్థలాలు ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ గద్దర్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతుల కోసం ప్రయత్నించినా ఫలితం లేదని, కానీ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలంటే మరో ఒక్క రోజు అనుమతి వస్తోందన్నారు. మరో వైపు జనసేన నేతలు సీఎంనే బహిరంగంగా విమర్శిస్తుంటే వారిపై చర్యలు తీసుకోవడం రేవంత్ రెడ్డికి చేత కావడం లేదన్నారు. ఇప్పకైనా తెలంగాణపై విషం కక్కడం మానుకోవాలని, లేని పక్షంలో బారాబర్ కొట్లాడుతామని, టీడీపీకి చెందిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ విభజన ప్రక్రియను చీకటి రోజుగా అభివర్ణించాడని, మరో వ్యక్తి తెలంగాణ వాదమే డిక్షనరీలో లేదంటున్నాడని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు తెలంగాణకు చెందిన ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కవి, రచయిత పసునూరి రవీందర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆంధ్రా వలస పాలకుల దోపిడీ అగలేదని, ఇక్కడి సంపద, వనరులను దోచుకునేందుకు కొత్త ఎత్తుగడలను వేస్తున్నారన్నారు. తెలంగాణ సమాజంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో కవి, రచయిత పసునూరి రవీందర్, జర్నలిస్టు సజయ, దాసోజు లలిత తదితరులు పాల్గొన్నారు.
Next Story






