- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీవీకే విజయాన్ని అసలు ఊహించలేదు.. ఉదయనిధి స్టాలిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సీఎం విజయ్ టీవీకే గెలుపుపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే అధినేత తలపతి విజయ్ (Thalapathy Vijay)పై డీఎంకే శాసనసభా పక్ష నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) తొలిసారి ఆసక్తిర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుత సీఎం విజయ్ ఇంతటి భారీ విజయాన్ని సాధిస్తారని తాము అస్సలు ఊహించలేదని అన్నారు. గత ఎన్నికల సరళిని విశ్లేషిస్తూ ఉదయనిధి స్టాలిన్ తమ పార్టీ చేసిన కొన్ని పొరపాట్లను నిర్మొహమాటంగా అంగీకరించారు. రాజకీయాల్లో తమ నిజమైన ప్రత్యర్థి ఎవరు అనేది గుర్తించడంలో మేము పూర్తిగా విఫలమయ్యామని అన్నారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో పెద్దగా బలం లేని, లేనిపోని శత్రువులతో పోరాడుతూ తమ విలువైన సమయాన్ని, శక్తిని వృథా చేసుకున్నామని తెలిపారు. కానీ తెరవెనుక విజయ్ నేతృత్వంలోని టీవీకే ఇంతటి బలమైన పునాదిని నిర్మించుకుంటుందని అంచనా వేయలేకపోయామని ఉదయనిధి పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో డీఎంకే (DMK) సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తుందని ఉదయనిధి స్పష్టం చేశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, అసలైన రాజకీయ సవాలు ఎక్కడ ఉందో మాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందని అన్నారు. ఇకపై మా పూర్తి దృష్టి ఆ దిశగానే ఉంటుందని చెబుతూ అధికార టీవీకే ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు పంపారు.






