పాల్వంచలో నిషేధిత గంజాయి పట్టివేత

by Jakkula.Mamatha |

పాల్వంచ మండలలోని కేశవపురం గ్రామపంచాయతీ పరిధిలో గురువారం ఎండు గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను ఖమ్మం అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఎస్సై శ్రీహరి రావు సిబ్బందితో కలిసి పట్టుకున్నారు.

పాల్వంచలో నిషేధిత గంజాయి పట్టివేత
X

దిశ, పాల్వంచ రూరల్: పాల్వంచ మండలలోని కేశవపురం గ్రామపంచాయతీ పరిధిలో గురువారం ఎండు గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను ఖమ్మం అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఎస్సై శ్రీహరి రావు సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 4.480 కి.గ్రాల నిషేదిత గంజాయి సీజ్ చేసి.. 2 మోటార్ సైకిళ్ళు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో కర్నూల్‌కు చెందిన ఎస్కే మహమ్మద్ ఆవేజ్ భాష, పశుపాల జగన్నాథ్, ఛత్తీస్‌గఢ్ మల్కన్గిరి, నాలగుంట గ్రామానికి చెందిన ప్రసన్న జీత్ మండల్, ప్రీతం రాయ్ లు ఉన్నారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ ఎం.డి.ఖలీల్ అహ్మద్, జమాల్ షరీఫ్, కానిస్టేబుళ్లు, ప్రసన్న ఉపేందర్, నాగరాజ్, వి.శివ శంకర్ పాల్గొన్నారు.

Next Story