- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కర్నూలు జిల్లా వాసుల మృతి
by Vemula.Srinu Prasad |
కర్ణాటకలోని తుమకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైసూరు నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి రెండు కుటుంబాలు ఇన్నోవా, ఓమ్ని వాహనాల్లో వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ...

X
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక(Karnataka)లోని తుమకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. మైసూరు నుంచి కర్నూలు జిల్లా ఆదోని(Adhoni)కి రెండు కుటుంబాలు ఇన్నోవా, ఓమ్ని వాహనాల్లో వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు పరస్పరం బలంగా ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఆదోనికి చెందిన దంపతులు గజేశ్వర్ రెడ్డి, ఇందిర, కుమార్తె సౌమ్యగా పోలీసులు గుర్తించారు.
ఇద్దరి పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అల్లుడు రవి, మనవరాలు చార్వి, మనవడు చరిత్ రెడ్డిల పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విషాద వార్తతో ఆదోనిలో తీవ్ర శోకసముద్రం నెలకొంది.
Next Story






