- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థుల్లో ప్రతిభ వికాసానికి సమ్మర్ క్యాంప్‌లు దోహదం : ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
విద్యార్థుల్లో సృజనాత్మకత, క్రీడా స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు నిర్వహించే సమ్మర్ క్యాంప్‌లు కీలక పాత్ర పోషిస్తాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ. ప్రకాష్ గౌడ్ అన్నారు.

దిశ, శంషాబాద్: విద్యార్థుల్లో సృజనాత్మకత, క్రీడా స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు నిర్వహించే సమ్మర్ క్యాంప్‌లు కీలక పాత్ర పోషిస్తాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ. ప్రకాష్ గౌడ్ అన్నారు. జీహెచ్ఎంసీ శంషాబాద్ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్–2026 ముగింపు కార్యక్రమం గురువారం శంషాబాద్ జెడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్ మైదానంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమ్మర్ క్యాంప్‌లో పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ, విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగడానికి అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ జోన్ జోనల్ కమిషనర్ కె. చంద్రకళ మాట్లాడుతూ.. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. సమ్మర్ క్యాంప్‌కు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం క్యాంప్‌లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే టీ. ప్రకాష్ గౌడ్, జోనల్ కమిషనర్ కె. చంద్రకళ సంయుక్తంగా సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని పలువురు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సుమన్ రావు. నాయకులు గణేష్ గుప్తా, బండి గోపాల్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.






