- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోక్సో కోర్టులో విచారణ.. హాజరుకాని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్
by Vemula.Srinu Prasad |
విజయవాడ పోక్సో కోర్టులో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన కేసు విచారణ వాయిదా పడింది...

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ పోక్సో కోర్టు(Vijayawada POCSO Court)లో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్(Former YSRCP MP Gorantla Madhav)కు సంబంధించిన కేసు విచారణ వాయిదా పడింది. అత్యాచారానికి గురైన ఓ మైనర్ బాలిక వివరాలను మీడియాలో వెల్లడించారనే ఆరోపణలపై ఆయనపై ఈ కేసు నమోదైంది. అయితే ఈ విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరుకాకపోవడంతో న్యాయవాదులు కోర్టులో గైర్హాజరు పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. కేసు తదుపరి విచారణను జులై 13న చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.
Next Story






