- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేలకొండపల్లి బస్టాండ్‌ను సందర్శించిన ఆర్టీసీ ఎండీ.. అధికారులకు కీలక ఆదేశాలు
by Jakkula.Mamatha |
నేలకొండపల్లి మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌ను తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి సందర్శించారు.

X
దిశ, నేలకొండపల్లి: నేలకొండపల్లి మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌ను తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి సందర్శించారు. ప్రయాణ ప్రాంగణం మొత్తాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఎందుకు ఇంత కాలంగా నిరుపయోగంగా ఉందో వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల పాలేరు నియోజకవర్గంలో స్థానిక శాసన సభ్యులు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన ప్రజాదర్భార్‌లో వచ్చిన వినతి మేరకు.. మంత్రి ఆదేశాలతో బస్టాండ్ అభివృద్ధికి ప్రణాళికలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. బస్సుల రాకపోకలతో పాటు ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా వాణిజ్య అవసరాలను పరిశీలించామన్నారు. ఈ పర్యటనలో ఖమ్మం రీజనల్ మేనేజర్ సరిరాం నాయక్, డిపో మేనేజర్ శివ కుమార్‌తో పాటు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
Next Story






