ఈవీఎం గోదాము తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

by Jakkula.Mamatha |

జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్‌లో ఉన్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు.

ఈవీఎం గోదాము తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్‌లో ఉన్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ప్రతి నెల చేపట్టే సాధారణ తనిఖీలో భాగంగా గోదాంలో భద్రపరిచిన ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, ఇతర సాంకేతిక అంశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నెల ఈవీఎంల భద్రతపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోదాం వద్ద పటిష్ట భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ రామ్మోహన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story