- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీటెక్ విద్యార్థుల దూకుడు.. టీజీ లాసెట్ ఫలితాల్లో 72.96% ఉత్తీర్ణత
టీజీ లాసెట్, టీజీ పీజీఎల్ సెట్ ప్రవేశ పరీక్షల ఫలితాల్లో 72.96 శాతం మంది క్వాలిఫై అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో: టీజీ లాసెట్, టీజీ పీజీఎల్ సెట్ ప్రవేశ పరీక్షల ఫలితాల్లో 72.96 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఈ పరీక్షల ఫలితాలను హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొ.వి.బాల కిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో విడుదల చేశారు. మూడు, ఐదేళ్ల లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ లాసెట్), పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఎల్ సెట్) ప్రవేశపరీక్షలను ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ మే 18 న నిర్వహించింది. ఈ పరీక్షలకు మొత్తం 66,864 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా, 54,374 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 39,673(72.96 శాతం) మంది క్వాలిఫై అయ్యారు. లాసెట్ మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో ఏపీకి చెందిన మీసల విజయదుర్గ 94.31 మార్కులతో ఫస్ట్ ర్యాంకు సాధించింది. కరీంనగర్‌కు చెందిన కొత్తిరెడ్డి సాయి మణిదీప్ రెడ్డి 93.28 మార్కులతో సెకండ్ ర్యాంకు సాధించారు. పీజీఎల్ సెట్ ఎల్ఎల్ఎం రెండేళ్ల కోర్సులో రంగారెడ్డి జిల్లాకు చెందిన శేగూరి నిషిత 84 మార్కులతో ఫస్ట్ ర్యాంకు సాధించింది. హైదరాబాద్ కు చెందిన రమిడి నవీన్ కుమార్ 84 మార్కులతో సెకండ్ ర్యాంకు సాధించారు.
బీకామ్, బీటెక్, బీఎస్సీలదే అగ్రస్థానం
సాంప్రదాయ కోర్సులతో పాటు ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులు కూడా ఈ సారి భారీ సంఖ్యలో లాసెట్ వైపు మొగ్గు చూపడం విశేషం. ముఖ్యంగా బీకామ్, బీటెక్, బీఎస్సీ, బీఏ చదివిన విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పరీక్షకు హాజరై, ఉత్తీర్ణత సాధించారు. బీకామ్ లో అత్యధికంగా 14,477 మంది దరఖాస్తు చేసుకోగా, 11,923 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో రికార్డు స్థాయిలో 8,399 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి లా వైపు వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ విభాగంలో 11,179 మంది దరఖాస్తు చేసుకోగా, 8,746 మంది హాజరయ్యారు. ఇందులో 7,252 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. బీఎస్సీ సైన్స్ గ్రాడ్యుయేట్లలో 10,825 మంది దరఖాస్తు చేసుకోగా, 8,620 మంది పరీక్ష రాయగా, 6,817 మంది లాసెట్‌లో రాణించారు. ఆర్ట్స్ విభాగం నుండి 7,880 మంది దరఖాస్తు చేయగా, 6,391 మంది హాజరై, 4,969 మంది అర్హత సాధించారు.






