- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య
డిగ్రీలో ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో చెట్టుకు ఉరివేసుకొని యువకుడు మృతి చెందిన సంఘటన చేర్యాల పట్టణ కేంద్రంలోని గడితోట కాలనీలో చోటు చేసుకుంది.

దిశ, చేర్యాల: డిగ్రీలో ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో చెట్టుకు ఉరివేసుకొని యువకుడు మృతి చెందిన సంఘటన చేర్యాల పట్టణ కేంద్రంలోని గడితోట కాలనీలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రానికి చెందిన పిట్టల గణేష్(20) చేర్యాల ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా ఫలితాల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. తిరిగి రాసిన సప్లిమెంటరీ పరీక్షలు కూడా సరిగ్గా రాయలేదని అందులో కూడా ఫెయిల్ అవుతానని కుటుంబ సభ్యులకు తరుచు చెబుతూ మనోవేదన చెందేవాడు. ఇదే క్రమంలో గురువారం మధ్యాహ్నం పరీక్ష రాయడానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన మృతుడు తమ వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐతే గణేష్ చనిపోయే ముందు కావాలనే చనిపోతున్నానని,అమ్మ,అన్న అందరూ మంచిగా ఉండాలని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఘటన పైన చేర్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






