విద్యా సంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కేసులే : పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

by Nallavelli.Anjaneyulu |

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పాఠశాల, కళాశాల, ఇతర విద్యా సంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కేసుల నమోదులో పాటు జైలు జీవితం తప్పదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రిత్ సింగ్ హెచ్చరించారు.

విద్యా సంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కేసులే : పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
X

దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ కమిషనరేట్ పరిధిలో పాఠశాల, కళాశాల, ఇతర విద్యా సంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కేసుల నమోదులో పాటు జైలు జీవితం తప్పదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రిత్ సింగ్ హెచ్చరించారు. కార్యాలయంలో టొబాకో వాడొద్దనే పోస్టర్లను విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల వమేరకు వరంగల్ కమిషనరేట్ పరిధిలో 'ఆపరేషన్ సేఫ్ స్కూల్' పేరుతో విస్తృత తనిఖీలు నిర్వహి స్తున్నామన్నారు. మైనర్లు, స్కూల్ స్టూడెంట్లకు గుట్కా, సిగరెట్లు వంటి పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా విద్యాసంస్థల సమీపంలోని పాన్ షాపులు, ఇతర దుకాణాలను తనిఖీ చేస్తున్నామన్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి స్కూళ్లు, కాలేజీల పరిసరాలను టొబాకో ఫ్రీ జోన్లుగా మార్చేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు చేపట్టామన్నారు.విద్యా సంస్థ పరిసరాల్లో పోగాకు ఉత్పత్తులను నిషేధమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మనందరి పై ఉంద‌న్నారు.


చెడు అలవాట్లకు బానిసలుగా మారకుండా ఉండాలన్నారు. విద్యా సంస్థ పరిసరాల్లో పోగాకు విక్రయాలు నిషేదించమన్నారు. ఎవరైనా విద్యా సంస్థల వద్ద విక్రయాలపాల్పడితే సిగరెట్ అండ్ ఆదర్ టాబాకో ప్రొడక్ట్స్ - 2003 యాక్ట్ క్రింద చర్యలు చేపడుతామన్నారు. మైనర్లకు పోగాకు ఉత్పత్తులు విక్రయిస్తే జస్టిస్ జువైనల్ యాక్ట్ 2015 యాక్ట్ 77 ప్రకారం చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవరైన విద్యా సంస్థల వద్ద పోగాకు ఉత్పత్తులను విక్రయిస్తే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా ఉంచబడుతాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి, సి సి ఆర్ బి ఏసీపీ డేవిడ్ రాజు, వరంగల్ ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ సుజాత, ఏ. ఎస్. ఐ రాజేందర్ ప్రసాద్ పాల్గొన్నారు.

Next Story