- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమీర్‌పేట్ అగ్నిప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు క్రాక్.. రంగంలోకి జేఎన్‌టీయూ నిపుణులు
అమీర్‌పేట్ అగ్నిప్రమాదం కారణంగా అనూహ్యంగా 1043 నంబర్ మెట్రో పిల్లర్‌కు క్రాక్ రావడం కలకలం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన అమీర్‌పేట్ (Ameerpet)లో జరిగిన భారీ అగ్నిప్రమాదం ఇప్పుడు మెట్రో ప్రయాణికులను, అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రమాదం జరిగిన భవనానికి అత్యంత సమీపంలోనే మెట్రో పిల్లర్ ఉండటంతో, మంటల తీవ్రత మెట్రో నిర్మాణాలపై పడింది. భవనంలో ఎగసిపడిన మంటలు, తీవ్రమైన వేడి కారణంగా మెట్రో పిల్లర్ దెబ్బతినడంతో అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు.
1043 నంబర్ పిల్లర్‌కు తాకిన అగ్నికీలలు..
అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్‌కు కేవలం అడుగు దూరంలోనే మెట్రో పిల్లర్ ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎగసిపడిన మంటలు, తీవ్రమైన వేడి 1043 నంబర్ మెట్రో పిల్లర్‌కు బలంగా తాకాయి. మంటల వేడి కారణంగా సదరు మెట్రో పిల్లర్‌కు బీటలు వచ్చినట్లుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిత్యం లక్షలాది మంది ప్రయాణించే అత్యంత కీలకమైన మెట్రో మార్గం కావడంతో అధికారులు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించారు. పిల్లర్ యొక్క అంతర్గత నాణ్యతను, పటిష్టతను శాస్త్రీయంగా పరిశీలించేందుకు జేఎన్‌టీయూ (JNTU)కి చెందిన ప్రత్యేక నిపుణుల బృందం రంగంలోకి దిగింది. నిపుణులు ప్రత్యేక డివైజ్‌లను (Special Devices) ఉపయోగించి పిల్లర్ యొక్క ప్రస్తుత సామర్థ్యం, బేరింగ్ కెపాసిటీని పరీక్షించారు. మంటల వేడి వల్ల కాంక్రీట్ లోపల ఏమైనా రసాయన మార్పులు జరిగి పిల్లర్ బలహీనపడిందా అనే కోణంలో పరీక్షలు జరుగుతున్నాయి.
నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు
అగ్ని ప్రమాద తీవ్రత దృష్ట్యా ఎలాంటి ముందస్తు నష్టం జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జేఎన్‌టీయూ నిపుణుల బృందం అందించే సాంకేతిక నివేదిక (Technical Report) ఆధారంగా ఆ మార్గంలో మెట్రో సర్వీసుల నిర్వహణ, పిల్లర్ మరమ్మతులపై మెట్రో అధికారులు తదుపరి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కంప్లీట్ రిపోర్టు వచ్చే వరకు దెబ్బతిన్న పిల్లర్ పరిసరాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు కొనసాగుతాయని హెచ్ఎంఆర్ ప్రతినిధులు తెలిపారు.
వార్తలను ఖండించిన మెట్రో..
మెట్రో పిల్లర్ క్రాక్ అంటూ వస్తున్న వార్తలను హైదరాబాద్ మెట్రో ఖండించింది. ప్రమాద స్థలానికి పిల్లర్ దగ్గరగా ఉండటంతోనే 1043 పిల్లర్‌ను చెక్ చేశామని క్లారిటీ ఇచ్చారు. మెట్రో పిల్లర్‌కు ఎలాంటి డ్యామేజీ జరగలేదని, ప్రకటన బోర్డు కాలి.. దాని లిక్విడ్ పిల్లర్‌పై పడిందని హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు పేర్కొన్నారు.






