- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాదక ద్రవ్యాలకు పిల్లలను దూరంగా ఉంచాలి : ఏసీపీ ప్రశాంత్ రెడ్డి
మాదకద్రవ్యాలకు పిల్లలను దూరంగా ఉంచాలని కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి అన్నారు.

దిశ, ఎల్కతుర్తి : మాదకద్రవ్యాలకు పిల్లలను దూరంగా ఉంచాలని కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కేశవాపూర్, రామకృష్ణాపూర్, బావుపేట గ్రామసభల్లో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడారు. ఇటీవల కాలంలో పిల్లలు కాలేజీలో గంజాయి మత్తుకు అలవాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో మునిగి పిల్లలను సరిగ్గా పట్టించుకోవడంలేదని తెలిపారు. తమ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. అలాగే టీనేజ్ పిల్లలకు ద్విచక్ర వాహనం ఇస్తే.. ప్రమాదం జరిగినట్లయితే తల్లిదండ్రుల పైన కేసు అవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా రైతన్నలు పంట అవశేషాలను తగలబెట్టకూడదని, దానివల్ల భూసారం చెడిపోతుందని తెలిపారు. వారం రోజుల కింద జరిగిన శంభుని పల్లె నుంచి ఆరేపల్లి వరకు సుమారు 600 ఎకరాల వరి పంట అవశేషాలు కాలిపోయి తీరని నష్టం వాటిలిందన్నారు. అదేవిధంగా ఒక మనిషి సైతం ప్రమాదవశాత్తు చనిపోయాడు అన్నారు. గడ్డి ట్రాక్టర్ పూర్తిగా కాలిపోయింది అన్నారు. ఇకనుండి పంట అవశేషాలను తగలబెడితే క్రిమినల్ కేస్ అవుతుందని హెచ్చరించారు. ఆయన వెంట సీఐ పులి రమేష్, ఎస్సై నరసింహారావు ఉన్నారు.






