- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM అధ్యక్షతన కేబినెట్ భేటీ: పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో వివిధ అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు...

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అధ్యక్షతన అమరావతిలో జరిగిన కేబినెట్ భేటీ(Cabinet Meeting)లో వివిధ అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ చట్టం అమలుకు మంత్రులు ఆమోదం తెలిపారు. 2011 కేంద్ర చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవయవ మార్పిడి ప్రక్రియలో పారదర్శకత, వైద్య సదుపాయాల మెరుగుదలకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాన్ని సుప్రీం కోర్టు సూచనల మేరకు రాష్ట్రంలోనూ అమలు చేయాలని నిర్ణయించారు. భీమిలి, విశాఖపట్నం, శ్రీకాకుళం, చీరాల బీచ్‌లలో పైలట్ ప్రాజెక్టుగా బీచ్ షాక్స్ పాలసీని ఆమోదించారు. గోవా, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల అనుభవాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయాలని చేయాలని నిర్ణయించారు. రాజధాని అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఏవియేషన్, ఉపాధి, మత్స్యరంగం, పోలవరం, పారిశ్రామిక పార్కులు, పోర్టులు, పర్యాటకం వంటి వివిధ రంగాల్లోని ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు పచ్చజెండా ఊపారు. ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్ల కేజ్ కల్చర్ పాలసీ-2025 ముసాయిదాపై చర్చించి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు
ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు, అలాగే సీపీఎస్ రాకముందు నోటిఫికేషన్ ద్వారా ఎంపికై ఆలస్యంగా చేరిన వారికి పాత పింఛను (OPS) వర్తింపజేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు ‘ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ పాలసీ-2026’కు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం జూలై 1 నుంచి ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవికా మిషన్’ (VB-GRAMG) అమలుకు మరియు నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీ సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
‘అమరావతి ఐ’ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు
మౌలిక సదుపాయాలు, విద్యుత్, ఇతర రంగాలకు సంబంధించి.. కృష్ణా నది తీరంలో ‘అమరావతి ఐ’ ప్రాజెక్టు టెండర్లతో పాటు రాజధాని నిర్మాణ పనులకు, పోలవరం సహా పలు ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. మద్దువలస, యేలేరు రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ యూనిట్ల ఏర్పాటుకు, చిత్తూరు జిల్లాలో PM-KUSUM కింద సోలార్ ప్లాంట్ కోసం NREDCAPకు 30 ఏళ్ల లీజుకు అనుమతి లభించింది. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ HUDCO నుంచి రూ.300 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వడంతో పాటు, అగ్రిగోల్డ్ తదితర డిపాజిటర్ల కేసుల పరిష్కారానికి 21 పోస్టుల మంజూరుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.






