రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడి కోసం గాలిస్తున్నాం.. వెస్ట్ జోన్ డీసీపీ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2025-12-27 14:11:22  IST  )

డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం కొనసాగుతోంది.

రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడి కోసం గాలిస్తున్నాం.. వెస్ట్ జోన్ డీసీపీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: డ్రగ్స్ మాఫియాపై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బయటపడిన ఓ డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్ పేరు వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా రకుల్ సోదరుడు అమన్ డ్రగ్స్ వివాదంలో నిలిచారు. తాజాగా ఆయన మరోసారి డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్‌ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ డ్రగ్స్ కేసులో భాగంగా రకుల్ తమ్ముడు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుపై హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ఓ ప్రముఖ మీడియా ఛానల్‌తో మాట్లాడారు.

డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కోసం గాలిస్తున్నామని తెలిపారు. అమన్ ఇంకెవరికైనా డ్రగ్స్ అమ్మితే పెడ్లర్‌గా కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. ఇటీవల మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో ఇద్దరు ఆఫ్రికన్ మహిళలను అరెస్ట్ చేశామన్నారు. వారిని విచారిస్తే రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కస్టమర్‌గా ఉన్నట్లు చెప్పారన్నారు. అమన్ ప్రీత్ సింగ్ ఐదు సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తేలిందని అన్నారు. నైజీరియన్లు ముంబై నుంచి డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించామని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read More..

మాసబ్ట్యాంక్ డ్రగ్స్ కేసులో సెన్సేషన్.. పరారీలో ప్రముఖ హీరోయిన్ సోదరుడు

అనసూయకు నాగబాబు మద్దతు.. జనసేన నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్

Next Story