- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాసబ్ట్యాంక్ డ్రగ్స్ కేసులో సెన్సేషన్.. పరారీలో ప్రముఖ హీరోయిన్ సోదరుడు
న్యూ ఇయర్ వేళ నగరంలో అసాంఘీక కార్యకలాపాలు, డ్రగ్స్ విక్రయాలపై పోలీసులతో కలిసి ఈగల్ టీమ్ స్పెషల్ పోకస్ పెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: న్యూ ఇయర్ వేళ నగరంలో అసాంఘీక కార్యకలాపాలు, డ్రగ్స్ విక్రయాలపై పోలీసులతో కలిసి ఈగల్ టీమ్ స్పెషల్ పోకస్ పెట్టింది. తాజాగా, డిసెంబర్ 19న మాసబ్ ట్యాంక్ పోలీసులు ఈగల్ టీమ్ చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో 43 గ్రాముల కొకైన్ 11.5 గ్రాముల MDMA (ఎక్స్‌టసీ) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మత్తు పదార్థాల విలువ బ్లాక్ మార్కెట్‌లో రూ. లక్షల్లో ఉంటుందని వారు వెల్లడించారు. అయితే, ఈ కేసులో మలక్‌పేట్‌లోని సలీం నగర్ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ నితిన్ సింఘానియాతో పాటు, మలక్‌పేట్‌లోని అక్బర్‌బాగ్‌కు చెందిన వ్యాపారవేతత శ్రానిక్ సింఘ్వీని చాచా నెహ్రూ పార్కు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే, విచారణలో భాగంగా వారు డ్రగ్స్‌ను తమ సర్కిల్‌లోని కొందరికి సరఫరా చేస్తున్నట్లు తేలింది. ముంబై నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ కార్టెల్‌కు లింక్ ఉన్న ఇద్దరు ఆఫ్రికన్ మహిళలను లావీ, సెనెగల్ నేటివ్‌లు డిసెంబర్ 22న మాసబ్ ట్యాంక్ పోలీసులు అరెస్టు చేశారు. వారు ముంబైలోని బోరివలి నుంచి డ్రగ్స్ తరలించి హైదరాబాద్‌కు అందజేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ప్రముఖ హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు..
ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నితిన్ సింఘానియా, శ్రానిక్ సింఘ్వీలను పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. వారు టాలీవుడ్, బాలీవుడ్ గుర్తింపు ఉన్న ప్రముఖ హీరోయిన్ సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్ పేరును బయటపెట్టారు. దీంతో అతడి కోసం ప్రస్తుతం ఈగల్ టీం, మాసబ్ట్యాంక్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతడు దొరికితే కేసులో మరిన్ని కీలక అధికారులు అభిస్తాయని భావిస్తున్నారు. నితిల్ సింఘానియా, శ్రానిక్ సింఘ్వీల నుంచి అమన్‌ప్రీత్ సింగ్ భారీ ఎత్తున డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అతడు గతేడాది ఓ డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే.






