ఎనిమిదేళ్ల చిన్నారి పై ఇద్దరు యువకుల అఘాయిత్యం

by Batti.Sumithra |   (  Updated:2026-02-09 07:11:35  IST  )

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలంలోని ఓ గ్రామంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఎనిమిదేళ్ల చిన్నారి పై ఇద్దరు యువకుల అఘాయిత్యం
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలంలోని ఓ గ్రామంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లిన వేళ.. ఆ పసిపాపపై కామాంధుల కండ్లు పడ్డాయి. ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉన్న ఎనిమిదేళ్ల బాలికను అదను చూసి అపహరించుకుపోయి, తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఓ యువకుడు, మరో వ్యక్తితో కలిసి మద్యం మత్తులో చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. అఘాయిత్యం చేసిన అనంతరం, ఏమీ ఎరుగనట్టుగా చిన్నారిని తీసుకువచ్చి ఆమె ఇంట్లోనే పడేసి వెళ్లడం వారి తెగింపునకు నిదర్శనం.

యువకుల దాష్టీకంతో చిన్నారి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం భూపాలపల్లి జిల్లాలోని వంద పడకల ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై పోక్సో (POCSO) చట్టం కింద కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద తల్లిదండ్రులు పొట్టకూటి కోసం పనికి వెళ్తే, నమ్మకంగా ఉండాల్సిన ఊరిలోనే ఇలాంటి మృగాళ్లు తిరగడం భయాందోళనకు గురిచేస్తోంది. మద్యం మత్తులో పసిమొగ్గను నలిపేసిన ఈ మృగాలను వెంటనే కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.

ఏపీలో దారుణం.. 40రోజుల పసికందును నదిలో వదిలేసిన తల్లి

చిన్నారి పై జరిగిన అత్యాచారం దారుణం : ఎంపీ డా. కడియం కావ్య

Next Story