ఏపీలో దారుణం.. 40రోజుల పసికందును నదిలో వదిలేసిన తల్లి

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-09 05:15:55  IST  )

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మానసిక సమస్యతో బాధపడుతున్న ఓ తల్లి తన 40 రోజుల పసిబిడ్డను నదిపో పడేసింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగింది.

ఏపీలో దారుణం.. 40రోజుల పసికందును నదిలో వదిలేసిన తల్లి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మానసిక సమస్యతో బాధపడుతున్న ఓ తల్లి తన 40 రోజుల పసిబిడ్డను నదిపో పడేసింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చోడవరం కోటవీధికి చెందిన లీల, బంటు శివ భార్యభర్తలు. వీరికి గతేడాది మార్చిలో వివాహం జరగ్గా డిసెంబర్ 28న లీల మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ పుట్టిన తరవాత లీలకు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. మానసికంగా సైతం అనారోగ్యానికి గురైంది.

ఈ క్రమంలో ఆదివారం భర్త తన సొంత ఊరికి వెళ్లగా లీల బిడ్డను తీసుకుని అర్ధరాత్రి 12 గంటలకు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయింది. విషయం తెలియడంతో వెంటనే భర్త పోలీసులకు సమాచారం అందించారు. కానీ ఆచూకీ లభించలేదు. అయితే ఉదయం భర్తకు ఫోన్ చేసిన భార్య తాను ఎక్కడ ఉన్నానో చెప్పింది. అక్కడకు చేరుకున్న భర్త బిడ్డ గురించి అడగ్గా నదిలో చేయి జారి పడిపోయాడని తెలిపింది. దీంతో భర్త పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. గతంలోనూ తన భార్య బిడ్డను ఇంట్లో వదిలేసి వెళ్లిందని భర్త పోలీసులకు తెలిపారు. ఆమెకు మానసిక అనారోగ్య సమస్య ఉన్నాట్టు చెప్పాడు.

ఎనిమిదేళ్ల చిన్నారి పై ఇద్దరు యువకుల అఘాయిత్యం

Next Story