- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నారి పై జరిగిన అత్యాచారం దారుణం : ఎంపీ డా. కడియం కావ్య
రేగొండ మండలం పొనగండ్ల గ్రామంలో 8 ఏళ్ల చిన్నారి పై జరిగిన అత్యాచార ఘటన పై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్యగా తీవ్రంగా ఖండించారు.

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : రేగొండ మండలం పొనగండ్ల గ్రామంలో 8 ఏళ్ల చిన్నారి పై జరిగిన అత్యాచార ఘటన పై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్యగా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అత్యంత దారుణమని పేర్కొన్న ఎంపీ, చిన్నారి పై అమానుష ఘటనకు పాల్పడినవారికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను కోరారు. కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించి త్వరితగతిన న్యాయం చేయాలని సూచించారు. బాధిత చిన్నారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పై ఫోన్ ద్వారా వైద్యులను అడిగి తెలుసుకున్న ఎంపీ మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. చిన్నారుల పై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, సమాజంలో భద్రతా వాతావరణం నెలకొల్పాలని ఎంపీ డా. కడియం కావ్య స్పష్టం చేశారు.






