ఎయిర్ హోస్టెస్‌లతో అసభ్య ప్రవర్తన.. ఇద్దరు ప్రయాణికులు అరెస్టు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-16 05:06:39  IST  )

ఇద్దరు ప్రయాణికులను సీఐఎస్ఎఫ్ (CISF) సిబ్బంది, ఎయిర్‌పోర్టు పోలీసులు (Airport Police) అదుపులోకి తీసుకున్న ఘటన ఇవాళ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport) పరిధిలో చోటుచేసుకుంది.

ఎయిర్ హోస్టెస్‌లతో అసభ్య ప్రవర్తన.. ఇద్దరు ప్రయాణికులు అరెస్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇద్దరు ప్రయాణికులను సీఐఎస్ఎఫ్ (CISF) సిబ్బంది, ఎయిర్‌పోర్టు పోలీసులు (Airport Police) అదుపులోకి తీసుకున్న ఘటన ఇవాళ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport) పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానంలో ప్రయాణించిన రమేష్ (42) అనే వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌ను అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. అయితే, ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఆమె ఫిర్యాదు మేరకు రమేష్‌ను సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్టు పీఎస్‌లో అప్పగించారు.

ఇక మరో ఘటనలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన మరో ఇండిగో విమానంలో ప్రయాణించిన నాజర్ (35) అనే వ్యక్తి మత్తులో ఉండి ఎయిర్ హోస్టెస్‌ను అసభ్యకరంగా మాటలతో వేధించాడు. అనంతరం ఆమెపై చేతులు వేయడానికి ప్రయత్నించాడు. సిబ్బంది అడ్డుకోవడంతో ఇతర ప్రయాణికులతో అతడు గొడవ పడ్డాడు. విమానం దిగగానే అతడిని ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read More..

ఘోర‌ విమాన ప్రమాదం.. 10 మంది మృతి !

నేలకూలిన ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ విగ్రహం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Next Story