- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర విమాన ప్రమాదం.. 10 మంది మృతి !
ఓ ఫుట్ బాల్ స్టేడియం ఉంది. ఆ స్టేడియంలోనే అత్యవసర ల్యాండింగ్ కు పైలెట్ ప్ర

దిశ, వెబ్ డెస్క్: మెక్సికోలో పెను విషాదం చోటుచేసుకుంది. మెక్సికోలోని టోలుకా విమానాశ్రయ సమీపంలో ఓ విమానం ప్రమాదానికి గురైంది. మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి బయలుదేరిన ఓ మినీ జెట్ కుప్పకూలినట్లు తెలుస్తోంది. అత్యవసర లాండింగ్ కు ప్రయత్నించిన ఆ మినీ జెట్, అక్కడే కుప్పకూలిందని అంటున్నారు అధికారులు. ఈ సంఘటనలో ఇద్దరు సిబ్బందితో పాటు ఏకంగా 10 నుంచి 8 మంది ప్రయాణికులు మరణించినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ ప్రమాదం జరిగిన సమీపంలోనే ఓ ఫుట్ బాల్ స్టేడియం ఉంది. ఆ స్టేడియంలోనే అత్యవసర ల్యాండింగ్ కు పైలెట్ ప్రయత్నించాడట. కానీ పరిస్థితి అదుపు తప్పడంతో అక్కడే ఉన్న ఓ కంపెనీ పైకప్పు పై ఆ మినీ జెట్ పడి, పేలిపోయింది. ఈ సంఘటన జరిగిన వెంటనే అలర్ట్ అయిన అధికారులు, సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అటు ఈ మినీ జెట్ కింద పడిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. క్లిక్
Read More..






