- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగు బస్సులకు అంటుకున్న మంటలు.. పలువురు దుర్మరణం!
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రహదారిపై ఘోరం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని మథురాలో యమునా ఎక్స్‌ప్రెస్‌వే (ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే)పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఆగ్రా-నోయిడా లేన్‌లో 127 మైలురాయి వద్ద పొగమంచు కారణంగా మూడు కార్లతో పాటు ఏడు బస్సులు ఒకదాని వెనుక మరొకటి ఢీకొన్నాయి. స్పాట్‌లోనే మంటలు చెలరేగడంతో అన్ని వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అందులో ఒక రోడ్‌వేస్ బస్సు, మిగతా ఆరు స్లీపర్ బస్సులు ఉన్నాయి. స్థానికుల సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు మథురా (రూరల్) ఎస్పీ సురేష్‌చంద్ర రావత్ వెల్లడించారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయని, నాలుగు మృతదేహాలను వెలికితీశామని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Next Story






