నేలకూలిన ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ విగ్రహం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-16 04:34:49  IST  )

బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలోని గ్వాయిబా నగరంలో బలమైన తుఫాను బీభత్సం సృష్టించింది.

నేలకూలిన ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ విగ్రహం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలోని గ్వాయిబా నగరంలో బలమైన తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే హవాన్ (Havan) అనే అతిపెద్ద రిటైల్ స్టోర్ ఎదుట ఉన్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం గంటకు 90 కి.మీపైగా వేగంతో వీచిన గాలులకు ఒక్కసారిగా నేలకూలిపోయింది. అయితే, 35 మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహాన్ని 2020లో హవాన్ చైనా స్టోర్ల ఓపెనింగ్‌ గుర్తుగా ఏర్పాటు చేశారు. తాజాగా బలమైన గాలులు వీచిన నేపథ్యంలోనే విగ్రహం నెమ్మదిగా వంగి, పార్కింగ్ లాట్‌‌లో పడిపోయింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో అదృష్టవశాత్తు స్టోర్ సిబ్బంది, స్థానికులు ఎవరు అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.

Click for Tweet..

Read More..

ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. విమాన, రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం

Next Story