- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తరగతి గదిలో దారుణం: తోటి విద్యార్థిని కాల్చి చంపి, విద్యార్థి బలవన్మరణం
తోటి విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపి.. అదే తుపాకీతో మరో విద్యార్థి పాయింట్ బ్లాంక్‌లో షూట్ చేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన పంజాబ్ రాష్ట్రంలోని తార్న్‌తరణ్ జిల్లా మై భాగో లా కాలేజీలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తోటి విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపి.. అదే తుపాకీతో మరో విద్యార్థి పాయింట్ బ్లాంక్‌లో షూట్ చేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని తార్న్‌తరణ్ (Tarn Taran) జిల్లా మై భాగో లా కాలేజీలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. చనిపోయిన విద్యార్థులను ప్రిన్స్ రాజ్ సింగ్ (Prince Raj Singh), సందీప్ కౌర్ (Sandeep Kaur)లుగా గుర్తించారు. వీరిద్దరూ లా మొదటి సంవత్సరం చదువుతున్న క్లాస్‌మేట్స్ అని సమాచారం. అయితే, కాల్పులకు సంబంధించిన దృశ్యాలు క్లాస్ రూంలో ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.
కాగా, క్లాస్ జరుగుతుండగానే ప్రిన్స్ రాజ్‌సింగ్ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో తోటి విద్యార్థిని సందీప్ కౌర్‌పై కాల్పులు జరిపాడు. అనంతరం సందీప్ కౌర్ తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత నిందితుడు ప్రిన్స్ రాజ్‌సింగ్ అదే తుపాకీతో పాయింట్ బ్లాంక్ రేంజ్ (Point Blank Range)లో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఆ విద్యార్థుల మధ్య ఉన్న వివాదం ఏంటి? ప్రేమ వ్యవహారమా.. మైనర్ అయిన విద్యార్థికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది..? అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో కళాశాలలోని విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు.
ఎప్‌స్టీన్ మరణంపై పెరుగుతున్న అనుమానాలు.. ఒకరోజు ముందే మరణ ప్రకటన?
Flight Crash: కుప్పకూలిన చార్టర్డ్ ఫ్లయిట్.. పైలట్, ట్రైనీకి తీవ్ర గాయాలు






