- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Flight Crash: కుప్పకూలిన చార్టర్డ్ ఫ్లయిట్.. పైలట్, ట్రైనీకి తీవ్ర గాయాలు

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాష్ట్రం విజయపుర (Vijayapura) జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఓ ప్రైవేట్ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. బాబలేశ్వర్ (Babaleshwar) తాలూకాలోని మంగళూరు గ్రామం సమీపంలో ఉన్న ఒక బహిరంగ ప్రదేశంలో ఈ విమానం కూలిపోయింది. అది ‘రెడ్‌బర్డ్ ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీ’ (Redbird Flying Training Academy)కి చెందిన సెన్నా 172 (Cessna 172) రకం విమానంగా గుర్తించారు. ఈ విమానం కలబురగి నుంచి బెళగావికి వెళ్తుండగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం. విమానం గాల్లో ఉండగానే ఇంజిన్ వైఫల్యం లేదా ఇంధన సమస్య కారణంగా అదుపు తప్పి కిందకు దూసుకువచ్చింది. నేలకు తగిలే ముందు విమానంలోని ఇద్దరు వ్యక్తులు బయటకు దూకేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
విమానంలో ఉన్న పైలట్ కెప్టెన్ కునాల్ మల్హోత్రా, ట్రైనీ గౌతమ్ శంకర్ గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో విమానం మూడు ముక్కలైంది. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) దర్యాప్తునకు ఆదేశించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపడుతోంది.
తరగతి గదిలో దారుణం: తోటి విద్యార్థిని కాల్చి చంపి, విద్యార్థి బలవన్మరణం
ఎప్‌స్టీన్ మరణంపై పెరుగుతున్న అనుమానాలు.. ఒకరోజు ముందే మరణ ప్రకటన?






