- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎప్‌స్టీన్ మరణంపై పెరుగుతున్న అనుమానాలు.. ఒకరోజు ముందే మరణ ప్రకటన?
జెఫ్రీ ఎప్ స్టీన్ ఫైల్స్.. ఇప్పుడు ప్రపంచమంతా దీని గురించే చర్చించుకుంటోంది. ఏ నలుగురు కలిసినా.. ఎప్ స్టీన్ ఫైల్స్ గురించి విన్నావా? అన్న చర్చ మొదలవుతుంది.

దిశ, వెబ్‌డెస్క్: జెఫ్రీ ఎప్ స్టీన్ ఫైల్స్.. ఇప్పుడు ప్రపంచమంతా దీని గురించే చర్చించుకుంటోంది. ఏ నలుగురు కలిసినా.. ఎప్ స్టీన్ ఫైల్స్ గురించి విన్నావా? అన్న చర్చ మొదలవుతుంది. ఈ ఫైల్స్ లో ప్రపంచంలోని ప్రముఖ పేర్లు బహిర్గతమవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. అపర కోటీశ్వరుడైన ఎప్ స్టీన్.. ఎంతోమంది మైనర్ బాలికలను సెక్స్ ట్రాఫికింగ్ చేశాడు. లైంగిక వేధింపుల నెట్‌వర్కును నడిపాడు. 2019లో అతను జైల్లో అనుమానాస్పదంగా మరణించాడు. అమెరికా అటార్నీ అతనికి సంబంధించిన పత్రాలు, ఫొటోలు, వీడియోలను విడుదల చేయగా.. ప్రపంచ దేశాల నేతల పేర్లు ఉండటం ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఎప్ స్టీన్ మరణంపై పలు అనుమానాలను లేవనెత్తుతూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
సెక్స్ ట్రాఫికింగ్ కేసులో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్ అనుమానాస్పద మరణంపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా విడుదలైన రికార్డుల ప్రకారం విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ (SDNY) అటార్నీ కార్యాలయం నుండి విడుదలైన సుమారు 23 పత్రాల్లో ఒక ప్రకటనపై ఆగస్టు 9, 2019 అని తేదీ ఉంది. కానీ ఎప్‌స్టీన్ తన సెల్‌లో మరణించినట్లు గుర్తించింది మాత్రం ఆగస్టు 10వ ఉదయం. అంటే అతను చనిపోవడానికి ఒక రోజు ముందే మరణ వార్తకు సంబంధించిన డ్రాఫ్ట్ కాపీలు సిద్ధమయ్యాయని తెలుస్తోంది.
అప్పటి మన్హట్టన్ యూఎస్ అటార్నీ జెఫ్రీ ఎస్. బెర్మన్ పేరుతో ఉన్న ఆ ప్రకటనలో.. "ఎప్‌స్టీన్ తన సెల్‌లో స్పందన లేకుండా కనిపించారని మన్హట్టన్ కరెక్షనల్ సెంటర్ ధృవీకరించింది" అని రాసి ఉంది. ఆగస్టు 9 రాత్రి 10:39 గంటల సమయంలో ఎప్‌స్టీన్ సెల్ వైపు ఒక 'ఆరెంజ్ రంగు ఆకారం' కదలడాన్ని సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించారు. దర్యాప్తు సంస్థలు ఆ ఆకారాన్ని ఒక అధికారి అని చెబుతుండగా, స్వతంత్ర విశ్లేషకులు అది ఖైదీ అని అనుమానిస్తున్నారు. ఆ సమయంలో ఒక ఖైదీని తీసుకెళ్లడం చాలా అసాధారణమని జైలు సిబ్బంది పేర్కొంటున్నారు.
ఎప్‌స్టీన్ స్పందన లేకుండా పడి ఉన్నప్పటి ఫోటోలు, మెడికల్ టీమ్ అతనికి స్ట్రెచర్‌పై సీపీఆర్ చేస్తున్న చిత్రాలను ఎఫ్‌బీఐ నివేదికలో చేర్చారు. ఆస్పత్రిలో తీసిన ఫోటోల్లో అతని పేరును "Jeffery" అని తప్పుగా రాసి ఉంది. 89 పేజీల పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం.. అతని మెడలోని 'థైరాయిడ్ కార్టిలేజ్' (thyroid cartilage) వద్ద ఎముకలు విరిగిపోయినట్లు తేలింది.
ఎప్‌స్టీన్ మరణం 'దిగ్భ్రాంతికరం' అని, బాధితులకు న్యాయం జరగకుండా ఇది అడ్డుపడుతుందని అటార్నీ కార్యాలయం పేర్కొంది. అతని మరణం తర్వాత కూడా ఈ కుట్రపై దర్యాప్తు కొనసాగుతుందని ప్రకటనలో వెల్లడించారు. ఈ ఫైల్స్‌లో ఒకే ప్రకటనకు సంబంధించిన పలు వెర్షన్లు ఉన్నాయి. కొన్నింటిలో పేర్లు, ఫోన్ నంబర్లు స్పష్టంగా కనిపిస్తుండగా, మరికొన్నింటిని కావాలనే తొలగించినట్లు తేటతెల్లమవుతోంది. అధికారికంగా ఎప్‌స్టీన్ మరణాన్ని ఆత్మహత్యగా ప్రకటించినప్పటికీ, మరణానికి ముందే స్టేట్‌మెంట్లు సిద్ధం కావడం, జైలులో ఆ రాత్రి జరిగిన వింత పరిణామాలు ఇప్పుడు అమెరికాలోనే కాదు.. ప్రపంచదేశాల్లో పెను దుమారం రేపుతున్నాయి.
తరగతి గదిలో దారుణం: తోటి విద్యార్థిని కాల్చి చంపి, విద్యార్థి బలవన్మరణం
Flight Crash: కుప్పకూలిన చార్టర్డ్ ఫ్లయిట్.. పైలట్, ట్రైనీకి తీవ్ర గాయాలు






