ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఐదుగురికి తీవ్ర గాయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-04 02:49:54  IST  )

మీర్జాగూడ (Mirzaguda) బస్సు ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలైన ఘటన మరువక ముందే నల్గొండ (Nalgonda) జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున మరో ప్రమాదం చోటుచేసుకుంది.

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఐదుగురికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మీర్జాగూడ (Mirzaguda) బస్సు ప్రమాదంలో 19 మంది దుర్మరణం పాలైన ఘటన మరువక ముందే నల్గొండ (Nalgonda) జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున మరో ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై బుగ్గబావిగూడెం (Buggabaavigudem) వద్ద ట్రాక్టర్‌ను వెనుక నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతివేగంతో ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నడి రోడ్డుపై బోల్తా పడిన ట్రాక్టర్‌ను పక్కకు తొలగించారు. అదేవిధంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Read More..

మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం.. మహిళ మృతి, 8మందికి గాయాలు

Next Story