- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం.. మహిళ మృతి, 8మందికి గాయాలు
తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదం ఘటన మరవకముందే నిన్న తెలంగాణలోని చేవెళ్లలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మంది మరణించారు. కాగా మంగళవారం ఏపీలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదం ఘటన మరవకముందే నిన్న తెలంగాణలోని చేవెళ్లలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మంది మరణించారు. కాగా మంగళవారం ఏపీలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి హైవేపై ట్రావెల్స్ బస్సు ఐషర్ వాహనాన్ని ఢీ కొట్టింది. బస్సు కిందపడటంతో ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం. అర్థరాత్రి సుమారు 1.45 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం
Read More..
మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఐదుగురికి తీవ్ర గాయాలు






