- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ రాజీవ్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ రాజీవ్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న మెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రేణికుంట శివారులోకి రాగానే ధాన్యం లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీ కొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు బస్ లో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయలయ్యాయి. సమాచారం అందుకున్న ఎల్ఎండి పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. కాగా ధాన్యం లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను బస్సు ఢీ కొనడం తో ట్రాక్టర్ లో ఉన్న ధాన్యం బస్తాలు రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్బ్రాంతి..
తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద బస్సు ట్రాక్టర్ ను ఢీకొన్న ఘటన పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మణిపూర్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి విషయం తెలిసిన వెంటనే కరీంనగర్ జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సంబంధిత పోలీసులతో మాట్లాడారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.ప్రమాదాల పట్ల ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే మంచిదని సూచించారు.






