- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య.. తండ్రి సంచలన ఆరోపణలు
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌లో పని చేస్తున్న యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌లో పని చేస్తున్న యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చిక్కడపల్లి (Chikkadapally) పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ (Jawahar Nagar)లోని ఆమె నివాసంలో రాత్రి 10.30 గంటలకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే, ఐదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న ఆమె, కూతురు, పూర్ణచందర్ అనే వ్యక్తితో కలిసి ఉంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే, అతడితో ఇటీవల జరిగిన గొడవల కారణంగానే స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలోనే మృతురాలి తండ్రి స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. తమ కూతురు చనిపోవడానికి ప్రధాన కారణం పూర్ణచందర్ అనే వ్యక్తేనని అన్నారు. భర్తతో విడిపోయాక తన కూతరు అతడితోనే కలిసి ఉంటోందని తెలిపారు. వారిద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరగుతున్నాయని పేర్కొన్నారు. దీంతో పూర్ణచందర్ (Poorna Chandra Rao)తో కలిసి ఉండలేను నాన్న అంటూ తన కూతురు జూన్ 26న చెప్పిందని అన్నారు. స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని పూర్ణచందర్ మాటిచ్చి ఆమెతో సహజీవనం చేశాడని.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో కాలయాపన చేస్తూ వచ్చాడని ఆరోపించారు. ఈ విషయంలోనే తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని.. అందుక కారణమైన పూర్ణచందర్‌ను కఠినంగా శిక్షించాలి స్వేచ్చ తండ్రి డిమాండ్ చేశారు.
Read More..






