Hyderabad : ప్రముఖ టీవీ యాంకర్ సూసైడ్

by Muthe.Rajitha |   (  Updated:2025-06-27 17:33:08  IST  )

Hyderabad : ప్రముఖ టీవీ యాంకర్ సూసైడ్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. ఓ టీవీ న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్చ తన ఇంట్లో శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. జవహర్ నగర్ లోని తన నివాసంలో ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు, ఆమె బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె తన తల్లి శ్రీదేవితో కలిసి రామ్ నగర్ లో నివాసం ఉంటుండగా.. జవహర్ నగర్ నివాసానికి ఎందుకు వెళ్ళిందనే అనుమానాలు చోటు చేసుకున్నాయి. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న స్నేహితులు, సన్నిహితులు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Next Story