ఇండస్ట్రీలో తీవ్ర విషాదం... గుండెపోటుతో నటి మృతి !

by velandi.Saikiran |   (  Updated:2025-06-28 08:16:52  IST  )

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది ప్రముఖ నటీనటులను ఇండస్ట్రీ

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం... గుండెపోటుతో నటి మృతి !
X

దిశ, వెబ్ డెస్క్ : చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది ప్రముఖ నటీనటులను ఇండస్ట్రీ కోల్పోయింది. అయితే తాజాగా సినిమా ఇండస్ట్రీలో మరో పెను విషాదం నెలకొంది. సినీనటి, ప్రముఖ మోడల్ షెఫాలీ జరివాలా మరణించారు. గుండెపోటుతో చెప్పాలి మరణించినట్లు చెబుతున్నారు.

ముంబైలో అర్ధరాత్రి గుండెపోటు రావడంతో.. సినీ నటి షెఫాలీ జరివాలా (Shefali Jariwala) తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. దీంతో ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ఆమె మృతి నేపథ్యంలో... ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సాయంత్రం ఆమె అంత్యక్రియలు కూడా జరుగనున్నాయి.

కాంటా లగా మ్యూజిక్ వీడియోలతో షెఫాలీ జరివాలా.. పాపులర్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో ముజ్ సే షాది కరోగి, కన్నడ ఇండస్ట్రీలో హుడుగురు లాంటి సినిమాలు చేసింది. అలాగే సీరియల్స్, వెబ్ సిరీస్ లు కూడా చేసింది ఈ అందాల తార. అయితే హిందీ బిగ్ బాస్ 13 లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్నారు.

Read More..

టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యలో బిగ్ ట్విస్ట్ !

Next Story