- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. అక్కడికక్కడే 9 మంది దుర్మరణం
అతివేగంతో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిన హృదయ విదారక ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: అతివేగంతో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిన భయానక ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మోతుగూడెం (Mothugudem) పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు (Chittoor) జిల్లాకు చెందిన శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్‌కు చెందిన బస్సు (AP 39 UM 6543) చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్టు దగ్గర అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మంది మరణించగా మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు 35 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. భద్రాచలంలో దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్పాట్‌లో మరికొంతమంది ప్రయాణికులు తీవ్ర గాయాలతో హాహాకారాలు పెడుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను ప్రారంభించారు. రంపచోడవరం (Rampachodavaram) నుంచి ఇప్పటికే రెండు అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి బయలుదేరాయి. ఈ మేరకు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారంతా చిత్తూరు వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Read More..






