బస్సు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

by Jakkula.Mamatha |   (  Updated:2025-12-12 04:11:49  IST  )

రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

బస్సు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్టు దగ్గర అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ(శుక్రవారం) ఉదయం జరిగింది. ఈ బస్సు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారని, పలువురు మృతి చెందగా గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించామని అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. సహాయక చర్యలు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు.

Read More..

ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. స్పందించిన పవన్ కల్యాణ్

ఘోర బస్సు ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి లోకేష్

Next Story