ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. స్పందించిన పవన్ కల్యాణ్

by Jakkula.Mamatha |   (  Updated:2025-12-12 04:12:54  IST  )

రాష్ట్రంలో ఈరోజు ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది.

ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. స్పందించిన పవన్ కల్యాణ్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఈరోజు ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డు రాజుగారి మెట్ట వద్ద ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో 9 మంది మృతి చెందారు. మరికొందరికీ తీవ్రగాయాలయ్యాయి. బస్సు ప్రమాద ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.

ఈ తరుణంలో అల్లూరి సీతారామ రాజు జిల్లాలో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారని తెలిసి చింతిస్తున్నాను. యాత్రికులతో కూడిన బస్సు చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపుతప్పి లోయలో పడిపోయిందని అధికారుల ద్వారా సమాచారం తెలుసుకున్నానని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ దుర్ఘటనలో 22 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించడమైనది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Read More..

ఘోర బస్సు ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి లోకేష్

మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ప్రమాద స్థలానికి బయలుదేరిన హోంమంత్రి అనిత

Next Story