- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ప్రమాద స్థలానికి బయలుదేరిన హోంమంత్రి అనిత
ఏపీలో ఈరోజు(శుక్రవారం) ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈరోజు(శుక్రవారం) ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డు రాజుగారి మెట్ట వద్ద ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో 9 మంది మృతి చెందారు. మరికొందరికీ తీవ్రగాయాలయ్యాయి. భద్రచాలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డు రాజుగారి మెట్ట వద్ద ప్రైవేటు బస్సు లోయలో పడిన దుర్ఘటన పై హోంమంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. యాత్రికులు దుర్మరణం చెందడం బాధాకరమన్నారు. విషయం తెలుసుకున్న హోం మంత్రి అనిత హుటహుటిన ప్రమాద స్థలానికి అనిత బయలుదేరారు. మరికాసేపట్లో అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Read More..






