- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనా మాంజా తగిలి గాయపడిన వృద్ధ మహిళ
ద్విచక్ర వాహనం పై వెళుతుండగా నిషేధిత చైనా మాంజా తగిలి వృద్ధ మహిళ కాలుకు తీవ్ర గాయమైన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది.

X
దిశ, మీర్ పేట్ : ద్విచక్ర వాహనం పై వెళుతుండగా నిషేధిత చైనా మాంజా తగిలి వృద్ధ మహిళ కాలుకు తీవ్ర గాయమైన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్‌గూడ కు చెందిన యాదమ్మ ( 75) పని నిమిత్తం తెలిసిన వారి ద్విచక్ర వాహనం పై వెళ్లారు. పని ముగించుకుని తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు చైనా మాంజా కాలికి చుట్టుకోవడంతో ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం వేగంగా ఉండడంతో ఆమె కాలుకు తీవ్ర గాయాలవ్వడాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
READ MORE .....
పోలీస్ మెడకు చైనా మాంజా చుట్టుకొని తీవ్ర గాయం.. బెంబేలెత్తిస్తున్న వరుస ప్రమాదాలు
Next Story






