- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ మెడకు చైనా మాంజా చుట్టుకొని తీవ్ర గాయం.. బెంబేలెత్తిస్తున్న వరుస ప్రమాదాలు
సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనా మాంజా (Chinese Manja) మరోసారి పంజా విసిరింది. హైదరాబాద్ నగరంలో తాజాగా నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ (ASI)గా విధులు నిర్వర్తిస్తున్న నాగరాజు ఈ మహమ్మారి బారిన పడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనా మాంజా (Chinese Manja) మరోసారి పంజా విసిరింది. హైదరాబాద్ నగరంలో తాజాగా నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ (ASI)గా విధులు నిర్వర్తిస్తున్న నాగరాజు (Nagaraju) ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఉప్పల్‌లోని తన నివాసం నుంచి విధులకు వెళ్తుండగా, మార్గమధ్యలో చైనా మాంజా ఆయన మెడకు చుట్టుకోవడంతో మెడ కొసుకొపోయి తీవ్ర రక్తస్రావమైంది. ఇది గమనించిన స్థానికులు ఆయనను వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
బెంబేలెత్తిస్తున్న వరుస ప్రమాదాలు
గత కొన్ని రోజులుగా నగరంలో ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతుండటం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఒక్క వారంలోనే పలువురు వాహనదారులు, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఈ మాంజా గాయాలపాలయ్యారు. ఇటీవలే గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూర్య తేజ, ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద సాయి వర్ధన్ రెడ్డి అనే టెక్కీలు మెడకు మాంజా చుట్టుకుని తీవ్రంగా గాయపడ్డారు. అలాగే పాతబస్తీలో ఓ డెలివరీ బాయ్ కూడా ఈ దారం కోసుకుపోవడంతో ఆసుపత్రి పాలయ్యారు.
చైనా మాంజాపై తెలంగాణ ప్రభుత్వం కఠిన నిషేధం విధించినప్పటికీ, నగరంలో గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు సాగుతుండటంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. పోలీసులు నగర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తూ లక్షల విలువైన నిషేధిత మాంజాలను సీజ్ చేస్తున్నారు. వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు ఫ్లైఓవర్లు, రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాల్లో తెల్లవారు జాము, రాత్రి సమయంలో ప్రయాణించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, మెడకు రక్షణగా జాకెట్లు, స్కార్ఫ్‌లు ధరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
READ MORE .....
మాంజా తగిలి ఏఎస్సై మెడకు తీవ్ర గాయం
చైనా మాంజా తగిలి గాయపడిన వృద్ధ మహిళ






