- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పహల్గామ్ దాడి ఘటన.. భారత్-పాక్ మ్యాచ్‌పై మోడీ సర్కార్‌కు ప్రతిపక్షాల విమర్శలు
దాయాది దేశంతో క్రికెట్ సంబంధాలపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు విమర్శించాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో.. పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటంపై విపక్ష నేతలు కేంద్రం ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కొలంబో వేదికగా ఈ రోజు రాత్రి జరగనున్న భారత్-పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ సమరానికి సర్వం సిద్ధమైంది. అయితే, దాయాది దేశంతో క్రికెట్ సంబంధాలపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు విమర్శించాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో.. పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటంపై విపక్ష నేతలు కేంద్రం ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. ‘ఆటలు మిత్రులతో ఆడాలి, శత్రువులతో కాదు’ అంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. పాకిస్తాన్‌ను ఒకవైపు శత్రుదేశంగా చూపిస్తూనే, మరోవైపు వారితో మ్యాచ్ ఆడటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించాయి.
ఇది జై షా ఆడిస్తున్న ఆట: సంజయ్ రౌత్
శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఈ మ్యాచ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ‘ఇది భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కాదు.. ఇది జై షా (బీసీసీఐ కార్యదర్శి) వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. భారత ప్రజలకు ఈ మ్యాచ్ ఇష్టం లేదు. కేవలం బెట్టింగ్, గ్యాంబ్లింగ్ మాఫియా ప్రయోజనాల కోసమే దీన్ని నిర్వహిస్తున్నారు’ అని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. గుజరాత్, రాజస్థాన్ కేంద్రంగా నడుస్తున్న బెట్టింగ్ సిండికేట్ల ద్వారా వేల కోట్లు చేతులు మారుతున్నాయని, ఆ డబ్బు పాకిస్తాన్ చేరి ఉగ్రవాదానికి నిధులుగా మారుతోందని రౌత్ ఆరోపించారు. ‘గత మ్యాచ్ ద్వారా పాకిస్తాన్‌కు రూ. 25,000 కోట్లు వెళ్లాయి. ఆ డబ్బే పహల్గామ్, పుల్వామా, పఠాన్‌కోట్‌లలో మన సైనికులపై బుల్లెట్ల రూపంలో దూసుకొస్తోంది’ అని ఆయన మండిపడ్డారు.
సిగ్గుచేటు చర్య: మనోజ్ ఝా
ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా స్పందిస్తూ.. పహల్గామ్ దాడి జరిగిన వెంటనే పాక్‌తో మ్యాచ్ ఆడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని, ఇందులో కోట్లాది రూపాయల వ్యాపారం దాగి ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ నేత రషీద్ ఆల్వీ మాట్లాడుతూ.. ‘మన దేశంలోకి వచ్చి ఉగ్రవాదాన్ని ప్రేరేపించే వారితో క్రికెట్ ఎలా ఆడతాం? కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఈ మ్యాచ్ జరిగేది కాదు. పహల్గామ్ మారణకాండ తర్వాత కూడా వారితో సత్సంబంధాలు నెరపడం సరికాదు’ అని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. మరోవైపు, బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి బహిష్కరించడానికి నిరసనగా పాకిస్తాన్ మొదట ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసినప్పటికీ, చివరకు ఆడేందుకు నిర్ణయించుకుంది. కాగా, ఈ సమాచారం జాతీయ మీడియా వెల్లడించింది.






