T20 WC : నేడు భారత్-పాక్ మ్యాచ్.. టీవీలకు అతుక్కుపోనున్న ప్రజలు

by Muthe.Rajitha |   (  Updated:2026-02-15 09:32:58  IST  )

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.

T20 WC : నేడు భారత్-పాక్ మ్యాచ్.. టీవీలకు అతుక్కుపోనున్న ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్ : క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్–పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్-Aలోని ఈ రెండు దేశాల మధ్య ఆటపై క్రీడాపరంగానే కాదు రాజకీయ పరంగాను ఎంతో హైప్ క్రియేట్ చేస్తోంది. శ్రీలంకలోని కొలొంబో వేదికగా సాయంత్రం 7:00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టాస్ 6:30 గంటలకు జరగనుంది.

కాగా ఈ మ్యాచ్‌కు ముందు అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదట పాకిస్తాన్ ప్రభుత్వం, PCB భద్రతా కారణాలతో మ్యాచ్‌ను బహిష్కరించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాయి. అయితే బాంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ICC, శ్రీలంక క్రికెట్ బోర్డు మధ్య జరిగిన చర్చల అనంతరం మ్యాచ్ న్యూట్రల్ వేదికపై నిర్వహించేందుకు పాక్ ప్రభుత్వం అంగీకరించింది. 2024–2027 ICC ఈవెంట్లలో భారత్–పాక్ మ్యాచ్‌లు న్యూట్రల్ వెన్యూల్లోనే జరగాలనే ఒప్పందం ప్రకారం ఈ మ్యాచ్ కొలంబోలో నిర్వహిస్తున్నారు.

గ్రూప్-Aలో సూపర్-8 దశకు చేరాలంటే ఇరు జట్లకూ ఇది అత్యంత కీలక పోరు. భారత్ తరఫున ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లు కీలక పాత్ర పోషించనున్నారు. పాకిస్తాన్ తరఫున బాబర్ అజమ్, షాహీన్ షా అఫ్రిదీ, నసీమ్ షా వంటి మ్యాచ్ విన్నర్లు రంగంలోకి దిగనున్నారు. పిచ్ రిపోర్ట్ ప్రకారం.. యూస్డ్ పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉందని తెలుస్తోండగా.. కొలంబోలో ఈరోజు సాయంత్రం వర్షం పడే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ సమాచారం. ఇప్పటికే టికెట్లు పూర్తిగా అమ్ముడుపోగా.. ప్రేక్షకులతో గ్యాలరీలు కళకళలాడనున్నాయి. ఇక ఇరు దేశాల ప్రజలు ఈరోజు సాయంత్రం టీవీలకే అతుక్కు పోయే అవకాశం ఉండటంతో గ్లోబల్ వ్యూయర్‌షిప్ బిలియన్లలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దాయాది దేశాల మధ్య జరిగే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ మరోసారి క్రికెట్ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని రాయనుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

నేడే భారత్ - పాకిస్తాన్ మ్యాచ్.. అభిమానులకు బ్యాడ్ న్యూస్

Next Story