- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడే భారత్ - పాకిస్తాన్ మ్యాచ్.. అభిమానులకు బ్యాడ్ న్యూస్
ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చేసింది. నేడే టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇందుకు శ్రీలంకలోని కొలంబో మైదానం వేదికైంది.

దిశ, వెబ్‌డెస్క్: ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చేసింది. నేడే టీ20 ప్రపంచకప్(ICC Men's T20 World Cup 2026)లో భాగంగా ఇండియా, పాకిస్తాన్(India vs Pakistan) మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇందుకు శ్రీలంకలోని కొలంబో మైదానం వేదికైంది. అయితే, ఈ దాయాదుల పోరుకు వరణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. కొలంబోలో ఆదివారం ఉదయం వర్షం కురిసేందుకు 93 శాతం అవకాశం ఉంది. అంతేకాదు.. 26 శాతం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడేందుకు ఆస్కారం ఉంది. అయితే, సాయంత్రానికి పరిస్థితి మెరుగుపడే అవకాశాలూ కూడా ఉన్నాయి. వాన పడే ఛాన్స్ 13 శాతానికి తగ్గనుందని ఆక్యూవెదర్ వెల్లడించింది. దీంతో వాన పడొద్దని క్రికెట్ అభిమానులు వేడుకుంటున్నారు. మరోవైపు, ఈ మ్యాచ్‌కు ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధినేత అమినుల్ ఇస్లాం బుల్‌బుల్, భారత్ తరఫున మిథున్ మన్హాస్, దేవజిత్ సైకియా, రాజీవ్ శుక్లా హాజరవుతారని సమాచారం. బంగ్లా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుల్‌బుల్ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌కు ఆసియా దేశాల ప్రతినిధులు కలిసి హాజరుకావాలన్నది ఐసీసీ నిర్ణయమని తెలిపారు.






