ఆ పనితో మనం బతికే ఉన్నామని జనాలకి గుర్తు చేస్తూనే ఉండాలి.. శ్రద్ధా శ్రీనాథ్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-25 15:34:41  IST  )

ఈ రోజుల్లో కేవలం నటిగా ఉంటే సరిపోదు. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ, మనం బతికే ఉన్నామని జనాలకి గుర్తు చేస్తూనే ఉండాలి.

ఆ పనితో మనం బతికే ఉన్నామని జనాలకి గుర్తు చేస్తూనే ఉండాలి.. శ్రద్ధా శ్రీనాథ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్‌లలో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రద్ధా శ్రీనాథ్. గత ఏడాది ‘ఆర్యన్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ‘బ్రో కోడ్’ మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రస్తుత జనరేషన్‌లో నటీనటులపై ఉన్న ఒత్తిడి గురించి శ్రద్ధా ఓపెన్‌గా మాట్లాడారు. "ఈ రోజుల్లో కేవలం నటిగా ఉంటే సరిపోదు. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ, మనం బతికే ఉన్నామని జనాలకి గుర్తు చేస్తూనే ఉండాలి. సినిమాల క్వాలిటీ కంటే ఆన్‌లైన్ విజిబిలిటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నాకైతే నా పర్సనల్ లైఫ్‌ను నిరంతరం ఆన్‌లైన్‌లో షేర్ చేయడం అస్సలు నచ్చదు.

కానీ అలా చేయకపోతే వెనకబడిపోతామనే భయం వేస్తుంది. ఒక ఫ్రెండ్ సలహా మేరకు ఇప్పుడు దీన్ని ఒక గేమ్ లాగా భావించి ఫాలో అవుతున్నాను" అని శ్రద్ధా శ్రీనాథ్ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటివరకు పలు రొమాంటిక్ డ్రామాలలో నటించి మెప్పించిన నటి శ్రద్ధా శ్రీనాథ్, ఇకపై మరింత సవాలుతో కూడిన పాత్రలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. "సినిమాల్లో సరికొత్తదనం తీసుకురావాలనుకుంటున్నాను. చారిత్రక డ్రామాలు, సైన్స్ ఫిక్షన్, భావోద్వేగ తీవ్రత ఉన్న పాత్రలు, అలాగే శారీరకంగా ఎక్కువగా శ్రమించే పాత్రలను పోషించాలని ఉంది. ఎప్పటికైనా వెండితెరపై ఒక పవర్‌ఫుల్ రాణి పాత్ర చేయాలనుకుంటున్నాను. కనీసం ఒక 'ఏజెంట్' పాత్ర అయినా సరే చేయాలనేది నా జీవితకాల కోరిక’’ అని చెప్పింది.

పెళ్లి చేసుకోవడంకంటే కుక్కను పెంచుకోవడం బెటర్.. కలర్ స్వాతి సంచలన వ్యాఖ్యలు


సెక్స్‌ను తప్పుగా చూడటం అస్సలు కరెక్ట్ కాదు.. కామాక్షి భాస్కర్ల బోల్డ్ స్టేట్‌మెంట్

Next Story